Team India : భారత టెస్టు క్రికెట్‌కు వెన్నెముకలా నిలిచిన అజింక్యా రహానే (Ajinkya Rahane) సైతం వీడ్కోలు పలికాడు. పునరాగమనం కోసం ఎదురుచూసి విసుగెత్తిపోయిన రహానే గుండెనిండా భాధతోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ (Virat Kohli), చతేశ్వర్ పూజారా(Chateshwar Pujara)లతో కలిసి ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన రహానే.. సెలెక్టర్లు యువకులకే ప్రాధాన్యం ఇస్తుండడంతో ఇక వైదొలగడమే మంచిదని ఈ నిర్ణయానికి వచ్చాడు. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానానికి ఎగబాకడం నుంచి విదేశాల్లో చరిత్రాత్మక సిరీస్ విజయాల్లో భాగమైన ఈ మాజీ సారథిని బీసీసీఐ వీడ్కోలు మ్యాచ్ ఆడించకపోవడం అభిమామానులను తెగ బాధిస్తోంది.
సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టును అజేయ శక్తిగా అవతరించడంలో కీలకమైన అజింక్యా రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా చెప్పేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ (BGT 2020-21) గెలుపొందిన సారథిగా రికార్డుకెక్కిన అతడు.. పునరామనం ఆశలు ఆవిరైన వేళ వీడ్కోలు వార్తతో అభిమానులను షాక్‌కు గురి చేశాడు. మూడేళ్ల క్రితం విరాట్, కోహ్లీ, రహానే.. వీళ్లు లేని భారత టెస్టు జట్టును ఊహించలేం.
Senior India batter Ajinkya Rahane announces retirement from international cricket.#AjinkyaRahane pic.twitter.com/CVtwVE5n82
— All India Radio News (@airnewsalerts) July 30, 2026
ఎందుకంటే.. సుదీర్గ అనుభమున్న ఈ ముగ్గురికి కష్ట సమయంలో ఇన్నింగ్స్ నిర్మించడం, ప్రత్యర్ధి బౌలర్లను విసిగించడం ఎలాగో బాగా తెలుసు. టీమిండియా వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్‌కు చేరడంలో ఈ సీనియర్ త్రయం కీలక పాత్ర పోషించారు. అంతేకాదు టెస్టుల్లో రోహిత్ సేన అగ్రస్థానంలో నిలవడంలో ఈ ముగ్గురి వాటాను మరువలేం. సుదీర్ఘ ఫార్మాట్లో మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటకు రహానే సెలవని చెప్పడంతో భారత క్రికెట్లో ఓ శకం ముగిసింది.
End of an era. pic.twitter.com/8VHjbiXdlO
— Cricinfo (@cricinfo) July 30, 2026
మహారాష్ట్ర.. అహ్మద్‌నగర్ జిల్లాలోని అష్వీ ఖుర్ద్‌లో జన్మించిన రహానే ఫస్ట్ క్లాస్‌లో ముంబైకి ఆడాడు. నిలకడగా రాణించిన అతడు 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్‌తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు రహానే.

పుజారా(3వ స్థానం), కోహ్లీ(4వ స్థానం)తో కలిసి మిడిలార్డర్లో భారత టెస్టు జట్టుకు మూల స్తంభంగా మారాడు. 2016లో న్యూజిలాండ్‌పై కోహ్లీ, రహానేలు.. నాలుగో వికెట్‌కు 365 రన్స్ చేయడం ఓ రికార్డు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో పుజరాతో కలిసి రహానే విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
కెరీర్ ఎంచక్కా సాగిపోతున్న దశలో రహానేకు డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ తర్వాత అవకాశాలు తగ్గాయి. ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి పుజారా రెండు ఇన్నింగ్స్‌ల్లో (14, 27 పరుగులు) తేలిపోయాడు. రహానే తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం(89), రెండో ఇన్నింగ్స్‌లో 46 రన్స్‌తో రాణించినా లాభం లేకపోయింది. ముఖ్యంగా 2021 తర్వాత రహానే సగటు 25కు పడిపోయింది. పైగా 31 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఒక్క శతకం చేయలేదు.

దాంతో, మిడిలార్డర్లో దూకుడుగా ఆడే కుర్రాళ్లవైపు చూశారు సెలెక్టర్లు. 2023 జూలైలో వెస్టిండీస్ పర్యటనలో చివరి టెస్టు ఆడిన రహానే.. అనంతరం దేశవాళీలో చెలరేగాడు. రంజీ ట్రోఫీ 2023-24లో ముంబై 42వ సారి విజేతగా నిలవడంలో అతడిది కీలక పాత్రే. అయినా సరే సెలెక్టర్లు మాత్రం రహానేకు అవకాశం ఇవ్వలేదు. నిరుడు జూన్‌లో కోహ్లీ, ఆగస్టులో పుజారా రిటైర్మెంట్ ప్రకటించగా.. రహానే కూడా వీడ్కోలు పలికాడు. మొత్తంగా 85 టెస్టుల్లో 12 శతకాలు, 26 హాఫ్ సెంచరీలు సాధించాడీ మాజీ కెప్టెన్.
రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను ఢీకొట్టింది టీమిండియా. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో సీనియర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), ఛతేశ్వర్ పూజారా (Chateshwar Pujara), అజింక్యా రహానే (Ajinkya Rahane)లు లేకుండానే బరిలోకి దిగింది.

ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ లేకుండా టీమిండియా 12 ఏండ్ల తర్వాత ఒక టెస్టు మ్యాచ్ ఆడింది. వెస్టిండీస్ (West Indies)తో 2011లో జరిగిన కోల్‌కతా టెస్టులో భారత జట్టు విరాట్, పూజారా, రహానే లేకుండానే ఆడింది. దాదాపు పుష్కర కాలం తర్వాత మళ్లీ ఈ త్రిమూర్తుల గైర్హాజరీలో టెస్టు మ్యాచ్ జరిగింది.