CM Revanth Reddy | నాంపల్లి కోర్టులు, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు గురువారం సమన్లు జారీచేసింది. వచ్చే నెల 25న ఆయనగానీ, ఆయన తరఫున న్యాయవాది గానీ కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పరువు నష్టం దావాను కోర్టు విచారణకు స్వీకరించింది.
సెక్షన్ 499 ఐపీసీ, 125 పీపుల్స్ రెప్రెజెంటేషన్ చట్టం కింద రేవంత్‌పై పరువునష్టం దావా నమోదైంది. విచారణ సందర్భంగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తర్‌ప్రదేశ్ కేసులో 125 ప్రజాప్రాతినిధ్యం చట్టం గురించి కోర్టు వివరించిందని, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌పై గజేంద్రసింగ్షెకావత్ దాఖలు చేసిన కేసులో సమన్లు జారీచేయడాన్ని ఫిర్యాదుదారుడు ప్రస్తావించారు.