ఎల్లారెడ్డిపేట, జూన్ 16 : ఉందామంటే జాగలేని, గూడు లేని కుటుంబాలకు ఇండ్లు నిర్మించి ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి డబుల్బెడ్రూమ్ కాలనీ వాసులు మంగళవారం కృతజ్ఞతా సంబురాలను నిర్వహించారు. గొల్లపల్లిలోని కేసీఆర్ కాలనీలోని ఇండ్లలోకి ప్రవేశించి ఐదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్‌చేసి కేసీఆర్, కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
48 కుటుంబాలకు భరోసానిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ సందర్భంగా వారు కొనియాడారు. వేడుకలో సర్పంచ్ కొండ రమేశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.