5 వేల కోట్లు ఇచ్చేదాకా కాలేజీలు బంద్.. బెదిరిస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీదేవసేన: ఫతి
రూ.10 వేల కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిల్లో రూ.5,000 కోట్లు విడుదల చేసేదాకా కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతుందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (ఫతి) స్పష్టంచేసింది.
- 8న ఎల్బీస్టేడియంలో అధ్యాపకుల సాంత్వన సభ
- 11న పది లక్షల మందితో ‘చలో హైదరాబాద్’
- ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల అసోసియేషన్ వెల్లడి
- ఫీజు కమిటీ నుంచి అనర్హుల్ని తొలగించాలని డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రూ.10 వేల కోట్ల రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల్లో రూ.5,000 కోట్లు విడుదల చేసేదాకా కాలేజీల నిరవధిక బంద్ కొనసాగుతుందని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) స్పష్టంచేసింది. మిగతా రూ.5,000 కోట్లలో నెలకు రూ.500 కోట్ల చొప్పున 10 నెలల్లో విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లు నెరవేర్చే వరకూ కాలేజీల బంద్ పాటిస్తామని ఫతి చైర్మన్ నిమ్మటూరి రమేశ్‌బాబు తేల్చిచెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఫతి కార్యవర్గ సమావేశం అనంతరం రమేశ్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం యాజమాన్యాలు పోరాడాల్సిన పరిస్థితి దాకా సర్కార్ నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.
అసలు విద్యార్థులు, కాలేజీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు కావా? అని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున కాలేజీలు బంద్ పాటిస్తుంటే ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలేదని, ఈ సమస్యను ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టిందని నిలదీశారు. అధ్యాపకులకు జీతాలిచ్చే పరిస్థితి లేకపోవడవంతోనే తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము బంద్‌కు దిగాల్సి వచ్చిందని చెప్పారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 8న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అధ్యాపకులతో భారీ సభను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ సభకు ‘తెలంగాణ అధ్యాపకుల సాంత్వన సభ’గా పేరు పెట్టామని, లక్షన్నర మంది అధ్యాపకులతో ఈ సభ జరుగుతుందని తెలిపారు. 10 లక్షల మందితో చలో హైదరాబాద్ పేరిట ఇదే నెల 11న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యాచరణ విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ కమిటీలో అనర్హులు
తాము 4 నెలల క్రితం రూ.లక్ష కోట్లతో ట్రస్ట్బ్యాంక్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించామని, కమిటీని ఏర్పాటు చేస్తూ సర్కారు జారీచేసిన జీవో తాము ఆశించిన విధంగా లేదని రమేశ్‌బాబు తెలిపారు. నివేదిక గడువును మూడు నెలల్లో కాకుండా నెల రోజుల్లోపే తెప్పించుకోవాలనాని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వేసిన కమిటీలో అనర్హులు ఉన్నారని, అవగాహన లేని వ్యక్తులతో ఆ కమిటీ వేశారని, వారిని వెంటనే తొలగించాలని డిమాండ్‌చేశారు. ఆర్బీఐ గవర్నర్, ఎస్బీఐ చీఫ్, బ్యాకింగ్ రంగ నిపుణులతో కమిటీని వేయాల్సి ఉండెనని చెప్పారు. కాలేజీలపై విజిలెన్స్ దాడులకు దిగడం నిరంకుశత్వమని, ఈ విచారణను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
శ్రీదేవసేన బెదిరించారు : ఫతి
విద్యాశాఖ ఇన్చార్జి కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన తమను బెదిరించారని ఫతి చైర్మన్ రమేశ్‌బాబు ఆరోపించారు. ఆమె తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. ‘యూజ్లెస్ కాలేజెస్’ అంటూ ప్రైవేట్ కాలేజీలను అవమానించారని ఆరోపించారు. శ్రీదేవసేనను పదవుల నుంచి తప్పించాలని, లేదా బదిలీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, కాలేజీ యాజమాన్యాలకు మధ్య వారధిగా, సంధానకర్తగా వ్యవహరించాల్సిన ఆమె.. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఫతి సెక్రటరీ జనరల్ కేఎస్ రవికుమార్, వైస్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ డాక్టర్ బొజ్జ సూర్యనారాయరెడ్డి, కోశాధికారి కొడాలి కృష్ణారావు, డాక్టర్ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

