హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం డిగ్రీ, వృత్తివిద్యా కాలేజీలు పోరుబాట పట్టనున్నాయి. ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని కళాశాలల యాజమాన్యాలు ఆగ్రహిస్తున్నాయి.
దీంతో కాలేజీలను మూసివేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్కారు విద్యపై చిత్తశుద్ధిలేదని మండిపడుతున్నాయి. గత్యంతరంలేని పరిస్థితుల్లో నవంబర్ 3 నుంచి కాలేజీలను నిరవధిక బంద్ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించాయి. నిరసనలో కాలేజీలన్నీ పాల్గొనాలని కోరాయి.