నల్లగొండ : జిల్లాలోని కొండమల్లేపల్లి మండల కేంద్రంలో లక్ష్మీ వెంకటేశ్వర పర్టిలైజర్, సీడ్స్ షాప్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు .యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వ, అమ్మకాలు ఈ పాస్ యంత్రంలో నమోదు వివరాలు, దుకాణం, గోదాంలోని ఎరువులు, పురుగు మందుల నిల్వలను పరిశీలించారు. ప్రస్తుతం యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ అందుబాటులో ఉన్నట్లు, యూరియాకు ఎలాంటి ఇబ్బంది లేదని దుకాణం యజమాని కలెక్టర్‌కు వివరించారు.
యూరియా, కాంప్లెక్స్, పొటాష్ ఎంత రేటుకు అమ్ముతున్నారు అడిగి తెలుసుకున్నారు. వచ్చే యాసంగి సీజన్‌కు కూడా ఎరువులు రైతులకు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని సూచించారు. అమ్మకాలు జరిపిన వెంటనే ఆన్ లైన్లో అప్డేట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం రైతు సేవా సహకార కేంద్రం తనిఖీ చేసి ఎరువులు స్టాక్, అమ్మకాల రికార్డులను పరిశీలించారు. రైతులకు అవసరమైన ఎరువులు ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల దుకాణంలో తనిఖీలు చేస్తున్న కలెక్టర్