హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ):వికారాబాద్లో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు భూ సేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఉద్రిక్తతకు దారి తీసింది. రైతులు అధికారులపైకి తిరగబడ్డారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ అక్కడ్నుంచి అధికారులను తరిమేశారు.
అయితే ఈ ఘటనపై వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘వాళ్లంతా మా రైతులు. వాళ్లు మాపై దాడి చేయలేదు. అది దాడి కానేకాదు. వాళ్లే మమ్మల్ని మాట్లాడటానికి పిలిచి తీసుకొని పోయారు. అయితే అక్కడ కొందరు ఉన్నారు. వాళ్లంతా కుట్ర చేయడం ప్రారంభించారు. వాళ్లంతా ట్రైబల్స్. మేం దాడి అని అనుకోవడం లేదు. మీడియా కూడా దాడి అని రాయొద్దు’ అని చెప్పారు.