గద్వాల, జూన్ 18 : జోగుళాంబ గద్వాల జిల్లా దవాఖానను మంగ ళవారం కలెక్టర్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్లు 14 మందితోపాటు మరో నలుగురు వైద్య సిబ్బంది విధులకు గైర్హాజర వడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు సక్రమంగా రాని 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్టోర్‌లో స్టాక్ వివరాలు, రిజిస్టర్లు సక్రమంగా లేకపోవడంతో ఫార్మసిస్ట్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.