Nallagonda | నైతిక ఓటింగ్ పై 5 కే రన్.. జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ హరిచందన
Nallagonda | కుల, మత, లింగభేదం తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును(Vote) కల్పించిందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన (Collector Harichandana) అన్నారు.
నల్లగొండ : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనదే అని, కుల, మత, లింగభేదం తేడా లేకుండా రాజ్యాంగం అందరికీ సమానంగా ఓటు హక్కును(Vote) కల్పించిందని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన (Collector Harichandana) అన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారా మంచి నాయకున్ని ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుందన్నారు. పలాన వారికి వేయాలని ఎవరో చెప్తే మీరు ఓటు వేయొద్దని, మీ ఆత్మ సాక్షిగా నైతిక ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు.
మంగళవారం ఆమె ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా నల్లగొండ పట్టణంలో నైతిక ఓటింగ్ పై నాగార్జున కళాశాల మైదానం నుంచి స్థానిక గడియారం సెంటర్ వరకు నిర్వహించిన 5 కే రన్‌ను(5K run) జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె స్థానిక గడియారం సెంటర్లో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఈ ఎన్నికలలో 85 సంవత్సరాలు నిండిన ఓటర్లకు, దివ్యాంగ ఓటర్లకు హోమ్ ఓటింగ్ సదుపాయం కల్పించిందని తెలిపారు.
హోమ్ ఓటింగ్ వేయాలనుకునే ఓటర్లు ఫామ్- 12 డి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, లేదా సాక్ష్యం యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగిరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ పుల్లారావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

