Telangana | గట్టు, నవంబర్ 5 : భారత్‌మాల రహదారి నిర్మాణ పనులను పరిశీలించడానికి జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం గట్టు మండలం లో పర్యటించారు. తప్పెట్లమొర్సు, ఆరగిద్ద ప్రాంతాల్లో రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తో కలిసి కలెక్టర్ రాయాపురం భారత్‌మాల క్యాంపు-1 వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లి కొద్దిసేపు గడిపారు. కార్యాలయానికి వ చ్చిన అధికారులకు రెవెన్యూ సిబ్బంది ఎలాంటి మర్యాద చేయకపోవడంతో తహసీల్దార్ సరితారాణిపై కలెక్టర్ ఫైర్ అయినట్టు సమాచారం. మంచినీళ్లు కూడా అందుబాటులో ఉంచకపోవడం ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే కలెక్టర్ ఎస్పీ, అదనపు కలెక్టర్‌తో కలిసి కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్టు తెలిసింది. మరోసారి తప్పిదం జరగకుండా చూస్తామని తహసీల్దార్ చెప్పినప్పటికీ కలెక్టర్ స్పందించలేదని సమాచారం. కలెక్టర్ వెళ్లిన తర్వాత రెవెన్యూ సిబ్బందిపై తహసీల్దార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారట.
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల డెవలప్మెంట్ చార్జీల బకాయిలను వెంటనే చెల్లించాలని, లేకుంటే కొత్త సబ్స్టేషన్లను, కొత్త లైన్లను ఏర్పాటు చేయలేమని, కరెం ట్ సరఫరా చేయలేమని ట్రాన్స్‌కో అధికారులు నీటిపారుదల శాఖకు స్పష్టం చేశా రు. ట్రాన్స్‌కో అధికారులు మంగళవారం విద్యుత్తుసౌధలో ఇరిగేషన్ అధికారులతో భేటీ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు రూ.2,700 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకు రూ.120 కోట్లు కలిపి మొత్తం రూ.6 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. వాటితోపాటు రూ.14,957 కోట్ల కరెంట్ బిల్లులను కూడా చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు కోరినట్టు సమాచారం.