హైదరాబాద్ : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ (Dilawarpur) మండలంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయాలని కోరుతూ రైతులు మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మహాధర్నాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు కొందరు రైతు ప్రతినిధులను అరెస్టు చేశారు.
దీంతో ధర్నాలో అరెస్టు చేసిన ఆందోళనకారులను విడుదల చేయాలని కోరుతూ ఇవాళ రైతులు, మహిళలు పోలీసుస్టేషన్ నుంచి నిర్మల్- భైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది. దిలావర్పూర్ రైతులతో కలెక్టర్ అభిలాష అభినవ్ చర్చలు జరిపారు.
ఈ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక పంపామని.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లామని గ్రామస్తులకు తెలియజేశారు కలెక్టర్. ఈ నేపథ్యంలో ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అయితే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినా రైతులు, జనాలు ఇంకా ఆందోళన విరమించడం లేదు. ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని వారు డిమాండ్ చేస్తున్నారు.
అంతకుముందు మహాధర్నాలో మహిళలు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. జాతీయ రహదారిపై ఆందోళనకారుల బైఠాయించడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది.
ఇథనాల్ పరిశ్రమ వల్ల తమ వ్యవసాయ భూములు పనికి రాకుండా పోతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
TG High Court | అధికారులు నిద్రపోతున్నారా..? మాగనూర్ పాఠశాల ఫుడ్ పాయిజనింగ్పై హైకోర్టు ఆగ్రహం..!
MLC Kavitha | ప్రజలు తిరగబడతారని ప్రభుత్వ పెద్దల్లో వణుకు : ఎమ్మెల్సీ కవిత