BRS Leaders Arrest | మక్తల్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శనకు వెళ్తారనే అనుమానంతో బుధవారం తెల్లవారు జామున మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నియోజకవర్గవ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన నేతలను అరెస్టు చేసి జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని మద్దూర్ పోలీస్ స్టేషన్‌కు నారాయణపేట పోలీసులు తరలించారు. మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫుడ్ ఫాయిజన్‌తో విద్యార్థులు అవస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించే అవకాశం ఉందనే అనుమానంతో బుధవారం తెల్లవారు నుంచే పోలీసులు అరెస్టులకు దిగారు. అరెస్టు చేసిన నాయకులను జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. మాగనూరులో నిరసనలు, ఆందోళనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డీఎస్పీ లింగయ్య నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరించారు. చిట్టెం రామ్మోహన్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు మక్తల్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు బలవంతంగా పోలీసులు అరెస్టు చేసి.. ఠాణాకు తరలించారు. పోలీసుల అత్యుత్సాహంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.