హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రిపూట చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. చాలాచోట్ల కని ష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం అతితక్కువగా 14.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చలి ఎక్కువగా వణికిస్తున్నది. రాత్రిపూట ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
హెచ్సీయూ ప్రాంతం లో 17.4 డిగ్రీలు, రాజేంద్రనగర్లో 18.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఆయా ప్రాంతాల్లోని అటవీ విస్తీర్ణం వల్ల సహజంగానే చల్లటి వాతావరణం ఉంటుందని, చలి తీవ్రత కూడా ఏటా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఈ నెల 9న మరింత తకువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నది.