హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గత మూడ్రోజులుగా చలి తగ్గుముఖం పట్టగా, తాజాగా మళ్లీ చలి తీవ్రత పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది.
అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్మాణిలో 7, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 8.7, సంగారెడ్డి జిల్లా కోహీర్లో 8.8, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 9.8 డిగ్రీల చొప్పున నమోదైంది.