హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్(సీవోఈ), ప్రత్యేక గురుకులాల్లోని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం, హానరోరియం సిబ్బందికి 6 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఇకనైనా వెంటనే వేతనాలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సొసైటీలోని రెగ్యులర్ సిబ్బందికి సైతం గత నెల వేతనాలు ఇప్పటికీ జమకాలేదు. ప్రతినెలా 2 లేదంటే, 3వ వారంలో వేతనాలు ఇస్తున్నారని, దీంతో ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని అసహనం వ్యక్తంచేస్తున్నారు.