ముథోల్, జూన్ 14 : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఆదివారం ఉదయం ఈ1-ఈ2 శక్తి మెస్‌లో విద్యార్థులు టిఫిన్ చేస్తుండగా ఆలు కుర్మాలో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. మెస్‌లో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని, ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
గతంలోనూ ఫుడ్ పాయిజన్ ఘటనలతో పలువురు విద్యార్థులు ఆసుపత్రిపాలైన విషయాన్ని గుర్తుచేశారు. అధికారులు జోక్యం చేసుకొని నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు.