హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : విశాఖపట్నం రైల్వేస్టేషన్లో నిలిపి ఉంచిన కోర్బా-విశాఖ ఎక్స్ప్రెస్ రైల్లోని మూడు ఏసీ బోగీల్లో ఆదివారం మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది మంటలను అదుపుచేసేలోపే బీ-6, బీ-7, ఎం-1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రైలులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రైలు ఉదయం 7 గంటలకు కోర్బా నుంచి విశాఖకు వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.