తొర్రూరు/పెద్దవంగర/కొడకండ్ల, జనవరి 10: మహబూబాబాద్, ఖమ్మంలో సీఎం సభలకు జనం పోటెత్తాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చా రు. మహబూబాబాద్‌లో ఈ నెల 12న సీఎం పర్యటన, 18 నుంచి కంటి వెలుగుపై మంగళవారం మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు క్యాంప్ కార్యాలయం, పెద్దవంగర, జనగామ జిల్లా కొడకండ్లలో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 12న మానుకోటలో సీఎం కార్యక్రమానికి శ్రేణులు పెద్ద ఎత్తున తరలికావాలని సూచించారు.