BRS Campaign | ఒక్క అవకాశం.. వార్డును అభివృద్ధి చేసి చూపుతా
BRS Campaign | ఒక్క అవకాశం ఇస్తే నర్సాపూర్ మున్సిపల్ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి తొంట వినయ్ కుమార్ ఓటర్లను కోరారు.
నర్సాపూర్ : ఒక్క అవకాశం ఇస్తే నర్సాపూర్( Narsapur ) మున్సిపల్ వార్డును అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ ( BRS ) అభ్యర్థి తొంట వినయ్ కుమార్( Vinay Kumar ) ఓటర్లను కోరారు. గురువారం నర్సాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
11వ వార్డు అన్ని విధాలుగా వెనుకబడి ఉందని, గెలిపిస్తే ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని , అర్హులైన పేదలకు ఇండ్లు నిర్మించడానికి కృషి చేస్తానని వెల్లడించారు. విధ్యుత్ లైట్లు, సీసీ రోడ్లు నిర్మిస్తానని తెలిపారు. ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు జ్ఞానేశ్వర్, సతీష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

