హైదరాబాద్, జనవరి 19(నమస్తే తెలంగాణ) : మంత్రుల మీద అనుకూల మీడియాలో కథనాలు వేయించిన రేవంత్, ఆ వ్యవహారంపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చే వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్‌రావు ఆరోపించా రు. దిమ్మెలు కూల్చడం కాదు.. నువ్వు ఎగ్గొట్టిన హామీలే నిన్ను, నీ పార్టీని బొం దపెట్టడం ఖాయమని హెచ్చరించారు. రేవంత్ చరిత్రహీనుడు.. చరిత్ర తెలియని మూర్ఖుడు అని విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఓడించింది చంద్రబాబును కదా? ఓటు కు నోటు కేసులో రేవంత్ అడ్డంగా దొరికినప్పుడే తెలంగాణ ప్రజలు ఆంధ్రా కు సాగనంపారు కదా? అసలు రేవంత్ కు చరిత్ర తెలుసా?’ అని సూటిగా ప్రశ్నాస్ర్తాలు సంధించారు. సోమవారం తెలంగాణ భవన్లో మన్నె గోవర్ధన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి రెండేండ్లలో పిచ్చికూతలు.. ప్రగల్భాలు పలుకడం తప్ప ప్రజలను ఉద్ధరించిందేమీ లేదని దుయ్యబట్టారు. ఖమ్మం సభలో పచ్చి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. నిజంగా రేవంత్‌కు టీడీపీపై ప్రేమ ఉంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి పార్టీ టికెట్‌పై ఖమ్మంలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. రేవంత్ పాలనపై దృష్టిపెట్టాలని, లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని స్పష్టంచేశారు.
ఎన్టీఆర్ చావుకు కారణమైన బాబును, శిశ్యుడు రేవంత్‌ను ఉరితీసినప్పుడే ఆయ న ఆత్మకు శాంతిచేకూరుతుందని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి స్పష్టంచేశా రు. కేసీఆర్‌పై అక్కసుతో ఖమ్మం సభలో బీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చాలని పిలుపు ఇచ్చారని మండిపడ్డారు.