Harish Rao | సింగరేణి టెండర్ల కేటాయింపులో అక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తెరలేపిండ్రు. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. కేవలం కమీషన్ల కోసమే సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌కి చెందిన శోధా కంపెనీకే ఈ సైట్విజిట్ సర్టిఫికెట్ విధానంలో తొలి టెండర్‌ను కట్టబెట్టిండ్రు. రేవంత్, మంత్రుల అనుయాయులకు మొత్తం 6 కాంట్రాక్టులను ప్లస్ 7 నుంచి 10 శాతానికి కేటాయించి వేల కోట్లు కొల్లగొట్టిండ్రు
-హరీశ్‌రావు
నైనీ బ్లాక్ టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటిరెడ్డి తన అనుయాయులకే దక్కాలని తన్నుకుంటేనే కదా ఈ అక్రమ వ్యవహారం బయటకొచ్చింది? ఇది వాటాల పంచాయితీ కాకుంటే మరేంది? వాటాల కోసం కొట్టుకున్నది వాస్తవం! కానీ మధ్యలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశులైండ్రు.
-హరీశ్‌రావు
హైదరాబాద్, జనవరి 19 (నమస్తేతెలంగాణ): సింగరేణి టెండర్ల విషయంలో సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. టెండర్ల కేటాయింపులో కాంగ్రెస్ సర్కార్ పెద్దలు అక్రమాలకు తెరలేపారని, కమీషన్ల కోసమే సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానం తీసుకొచ్చారని బయటపెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి కంపెనీ శోధాకే తొలి టెండర్ కట్టబెట్టారని, సీఎం, మంత్రుల అనుయాయులకు 6 కాంట్రాక్టులను ప్లస్ 7 నుంచి 10 శాతానికి కేటాయించి వేల కోట్లు కొల్లగొట్టారని వివరించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి మధ్య వాటాల పంచాయితీ తేలకనే నైనీ బ్లాక్ టెండర్‌ను రద్దుచేశారని, ఇదే విధానంలో అప్పగించిన 6 టెండర్లపై మాత్రం మౌనం వహిస్తున్నారని సంచలన విమర్శలు చేశారు. గతంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ సిస్టం ద్వారా అప్పగించిన 6 టెండర్లను రద్దుచేసి, సింగరేణి టెండర్ల స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి, బీజేపీతో కుమ్మక్కు కాకుంటే, చీకటి ఒప్పందం లేకుంటే తన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్‌చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలని హితవు పలికారు.
సీబీఐ విచారణకు ఆదేశిస్తే బీఆర్ఎస్ తరఫున అన్ని ఆధారాలు సమర్పిస్తామని తేల్చిచెప్పారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్గౌడ్తో కలిసి హరీశ్ విలేకరులతో మాట్లాడారు. మొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నైనీ కోల్‌బ్లాక్ టెండర్లను రద్దుచేసిన నేపథ్యంలో సింగరేణిలో టెండర్ల మాటున జరుగుతున్న అక్రమాలకు ఆధారాలు చూపుతూ బట్టబయలు చేశారు.
కమీషన్ల కోసమే సైట్ విజిట్ సిస్టం
సింగరేణి టెండర్ల కేటాయింపులో అక్రమాల కోసమే దేశంలో ఎక్కడాలేని, కోల్ ఇండియాలోనూ లేని సైట్ విజిట్ సర్టిఫికెట్ విధానాన్ని రేవంత్‌రెడ్డి సర్కార్ 2024లో తీసుకొచ్చిందని హరీశ్ వివరించారు. ఈ విధానంలో టెండర్ వేసే కాంట్రాక్టర్ సైట్ విజిట్ చేయాల్సి ఉంటుందని, తద్వారా కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకొని భయపెట్టి, బెదిరించి టెండర్ దక్కకుండా చేస్తూ తన అనయాయులు, బంధువులకు సింగరేణి టెండర్లను ప్లస్ 7 నుంచి 20 శాతం వరకు కట్టబెడుతూ వేలకోట్లు దోచిపెడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కాంపిటేటివ్ విధానంలో మైనస్‌కు కేటాయించిన టెండర్లను కూడా రద్దు చేసి సీఎం, మంత్రులు తన అనుచరులకు కట్టబె డుతున్నారని ఆరోపణలు గుప్పించారు. నైనీ బ్లాక్ వ్యవహారంలో వాటాల పంచాయితీ వచ్చి సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి కొట్టు కొనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవాచేశారు. అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ టెండర్‌ను క్యాన్సిల్ చేశారని చెప్పారు. కానీ ఇదే పద్ధతిలో అప్పగించిన మిగిలిన ఆరు టెండర్ల మాటేమిటి? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో మైనస్ 7..ఇప్పుడు ప్లస్ 7
బీఆర్ఎస్ హయాంలో ఆన్లైన్ సిస్టం, కాంపిటేటివ్ పద్ధతిలో ఏడు టెండర్లను మైనస్ నుంచి 20 వరకు అప్పగించామని హరీశ్ గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత కమీషన్లు, వాటాల కోసం అప్పటి టెండర్లను రద్దుచేస్తున్నదని ధ్వజమెత్తారు..‘వెంకటేశ్ ఖని, శ్రీరాంపూర్ ఓసీ-2ను మైనస్ 7కు కట్టబెడితే..ఇప్పుడు రద్దుచేసి ప్లస్ 7కు అప్పగించారు. డీల్ కుదరక శ్రీరాంపూర్ ఓసీ-2 విస్తరణ -2025 టెండర్ కేటాయింపును మూడుసార్లు వాయిదావేశారు. కమీషన్లు దండుకొని తమ అనుయాయులకు ఇచ్చేందుకు యత్నిస్తున్నారు’అని ఆరోపించారు.
పర్సెంటేజీల కోసం సింగరేణిలో డీజిల్ విధానం రద్దు
సింగరేణి గతంలో బల్క్‌లో ఐఓసీఎల్ నుంచి డీజిల్ సరఫరా చేసేదని హరీశ్ చెప్పారు. కానీ కాంగ్రెస్ సర్కార్ పెద్దలు తమ పర్సెంటేజీల కోసం సింగరేణి డీజిల్ కేటాయించే విధానాన్ని కాంట్రాక్టర్‌కే అప్పగించారని మండిపడ్డారు. తద్వారా సంస్థకు 50 నుంచి 100 శాతం నష్టంవచ్చే పరిస్థితి తలెత్తిందని వాపోయారు. ఈ వ్యవహారమంతా సీఎం సమీప బంధువు, సన్నిహితుల కనుసన్నల్లోనే జరుగుతున్నదని ఆరోపించారు. ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికెట్ కావాలన్నా, టెండర్ దక్కాలన్నా రింగ్ లీడర్ అయిన సీఎం బంధువు ఆజ్ఞ ఉండాల్సిందేనని స్పష్టంచేశారు.
ఐఏఎస్‌లు, జర్నలిస్టులు బలిపశువులు
రేవంత్‌రెడ్డిది ముమ్మాటికీ దండుపాళ్యం ముఠానేనని హరీశ్ ధ్వజమెత్తారు. గతంలో తాను ఇదే విషయం చెప్తే మంత్రులంతా తనపై ఒంటికాలిపై లేచారని గుర్తుచేశారు. మూటల పంచాయితీలో సీఎం, మంత్రులు కొట్టుకుంటున్నారని, నైనీ బ్లాక్ టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటిరెడ్డి తన్నుకొంటేనే ఈ అక్రమ వ్యవహారం బయటకొచ్చిందని దుయ్యబట్టారు. సీఎం, మంత్రుల వాటాల కొట్లాటలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశువులయ్యారని వాపోయారు. ‘రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో వాటాల పంచాయితీలు ముందుకొచ్చినయ్..ఆరు గ్యారెంటీలు వెనుకకు పోయినయ్’ అని దెప్పిపొడిచారు.
డీజీపీ..నీ ఖాకీ బుక్కును కాకెత్తుకుపోయిందా?
ప్రజల పక్షాన నిలుస్తున్న బీఆర్ఎస్, జర్నలిస్టులను వేధించేందుకు ఆగమేఘాలపై సిట్లు వేస్తున్న పోలీసు అధికారులకు కాంగ్రెస్ సీఎం, మంత్రుల అక్రమ వ్యవహారాలు కనబడకపోవడం దురదృష్టకరమని హరీశ్ వాపోయారు. ‘ఖాకీ బుక్కు అందరికీ సమానమని చెప్పే డీజీపీ శివధర్రెడ్డీ.. మీ ఖాకీ బుక్కును కాకెత్తుకుపోయిందా? తప్పు చేసినవారిని చట్టం వదిలిపెట్టదని జర్నలిస్టుల అరెస్ట్‌ల విషయంలో హూంకరించిన సజ్జనార్.. ఏమైంది నీ రూల్ బుక్? మీకు కాంగ్రెస్ నేతల అక్రమ వ్యవహారాలు కనిపించడం లేదా? వారి దుర్మార్గాలు మీ దృష్టికి రాలేదా’ అంటూ నిలదీశారు. మూటల పంచాయితీలో సీఎం, మంత్రులు కొట్టుకుంటున్నరు. నైనీ బ్లాక్ టెండర్ల విషయంలో సీఎం, భట్టి, కోమటిరెడ్డి తన అనుయాయులకే దక్కాలని తన్నుకుంటేనే కదా ఈ అక్రమ వ్యవహారం బయటకొచ్చింది? ఇది వాటాల పంచాయితీ కాకుంటే మరేంది? తన్నుక సచ్చింది నిజం! వాటాల కోసం కొట్టుకున్నది వాస్తవం! కానీ మధ్యలో ఐఏఎస్ అధికారులు, జర్నలిస్టులు బలిపశులైండ్రు.
రెండేండ్ల నుంచి సింగరేణికి రెగ్యులర్ సీఎండీ, డైరెక్టర్ లేరు. వీళ్ల అడుగులకు మడుగులొత్తే విధంగా..అక్రమాలు బయటకు రాకుండా ఇన్చార్జి సీఎండీలను పెట్టి ఇలాంటి అడ్డగోలు అక్రమ వ్యవహారాలు నడుపుతున్నరు. వెంటనే సైట్ విజిట్ సర్టిఫికెట్, డీజిల్ విధానాలను శాశ్వతంగా రద్దుచేసి, సింగరేణికి అర్హత, నిజాయితీ కలిగిన సీనియర్ ఐఏఎస్ అధికారిని సీఎండీగా నియమించాలి.
-హరీశ్‌రావు
సింగరేణి గతంలో బల్క్‌లో ఐవోసీఎల్ నుంచి డీజిల్ తెచ్చేది. కానీ కాంగ్రెస్ సర్కార్ పెద్దలు తమ పర్సెంటేజీల కోసం సింగరేణి డీజిల్ కేటాయించే విధానాన్ని కాంట్రాక్టర్‌కే అప్పగించారు. తద్వారా సంస్థకు 50 నుంచి 100 శాతం నష్టం వచ్చే పరిస్థితి తలెత్తింది. ఈ వ్యవహారమంతా సీఎం సమీప బంధువు, సన్నిహితుల కనుసన్నల్లోనే జరుగుతున్నది.
-హరీశ్‌రావు
గతంలో దేశంలోని వెస్ట్రన్ కోల్ బ్లాకులు, కోల్ ఇండియా, సింగరేణిలో ఏ కాంట్రాక్ట్ అయినా మైనస్ 7 నుంచి మైనస్ 20 శాతం వరకు పోతుండె.. రేవంత్‌రెడ్డి గద్దెనెక్కిన తర్వాత సైట్ విజిట్ సర్టిఫికెట్ సిస్టం తెచ్చారు. ఫిర్యాదులు వచ్చినా ముందుకెళ్లారు. ఈ విధానంలో టెండర్ వేసే కాంట్రాక్టర్ సైట్ విజిట్ చేయాలి. తద్వారా కాంట్రాక్టర్ ఎవరో తెలుసుకొని భయపెట్టి, బెదిరించి టెండర్ దక్కకుండా చేస్తూ తన అనయాయులు, బంధువులకు టెండర్లను ప్లస్ 7 నుంచి 20 శాతం వరకు కట్టబెడుతూ వేలకోట్లు దోచిపెడుతున్నారు.
-హరీశ్‌రావు
హరీశ్ సూటి ప్రశ్నలు