Errolla Srinivas | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): బాధ్యాతాయుత ప్రతిపక్షపార్టీ నాయకుడిగా ఎస్ఎల్బీసీ ఘటనాస్థలికి వెళ్లిన హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్ఎల్బీసీ వివరాలు తెలుసుకునేందుకు ఘటనాస్థలికి వెళ్లిన హరీశ్‌రావు బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం సరైందికాదని మండిపడ్డారు.
ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్, హరీశ్‌రావును విమర్శించారని, ఇది మంచి పద్ధతికాదని ఆయన హితవుపలికారు.