జ్యోత్స్న కుటుంబానికి 2 లక్షల చెక్కు
అనారోగ్యంతో మృతిచెందిన మహిళ కుటుంబానికి రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరుచేసి మంత్రి కేటీఆర్ పెద్ద మనసు చాటుకొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లెకు చెందిన కొస్ని శ్రీనివాస్-జోత్స్న దంపతులకు కూమార్తె, కుమారుడు ఉన్నారు.
- పేద కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండ
- సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం మంజూరు
- చెక్కు అందజేసిన ప్రజాప్రతినిధులు
సిరిసిల్ల రూరల్, ఏప్రిల్ 17: అనారోగ్యంతో మృతిచెందిన మహిళ కుటుంబానికి రూ.2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరుచేసి మంత్రి కేటీఆర్ పెద్ద మనసు చాటుకొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పాపయ్యపల్లెకు చెందిన కొస్ని శ్రీనివాస్-జోత్స్న దంపతులకు కూమార్తె, కుమారుడు ఉన్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాది క్రితం ప్రసవం సమయంలో జ్యోత్స్న గర్భసంచికి ఇన్ఫెక్షన్ అయి శరీరమంతా వ్యాపించింది. దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వీరి కుటుంబ స్థితిని స్థానిక నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేటీఆర్ బాధిత కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.2 లక్షలు మంజూరు చేయించారు. ఎంపీపీ పడిగెల మానస, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజన్న, స్థానిక నేతలు ఆదివారం శ్రీనివాస్‌కు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
పంజాబ్ వాసి మృతదేహం చేరవేతకు చేయూత
జడ్చర్ల టౌన్: పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం బెంగళూరు వచ్చి స్వరాష్ర్టానికి తిరిగి వెళ్తూ మార్గమధ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద రైలులో గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహం పంజాబ్‌కు వెళ్లేలా సాయం చేయాలని దేవేందర్ అనే నెటిజన్ ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. అవసరమైన సాయం చేసి, మృతదేహాన్ని పంజాబ్‌కు పంపించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్‌కు ట్విట్టర్లో ఆదేశించారు. వెంటనే స్పందించిన కలెక్టర్.. మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తిచేయించి అంబులెన్స్‌లో పంపిస్తున్నామని, అడిషనల్ కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని రీట్వీట్ చేశారు. వెంటనే చర్యలు తీసుకొన్న కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- CMRF check
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

