హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : నూతన పీఆర్సీ అమలుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జీ సదానందం డిమాండ్ చేశారు. శనివారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న చేపట్టిన పాత పింఛన్ సాధన ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
సత్యగ్రహ దీక్షకు మద్దతు : బీసీటీఏ
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): బీసీలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలకు ఈ నెల 25న రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తలపెట్టిన సత్యాగ్రహ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు బీసీటీఏ ప్రకటించింది. ఉద్యోగ, ఉపాధ్యాయులంతా ఈ దీక్షను విజయవంతం చేయాలని అధ్యక్షుడు కృష్ణుడు పిలుపునిచ్చారు.