స్టేషన్ ఘన్పూర్, మార్చి 22 : అధికార పార్టీకి చెందిన దళితులను కాదని కాంగ్రెస్‌లోకి వలస వచ్చిన వారికి ఎమ్మెల్యే కడి యం శ్రీహరి ప్రాధాన్యమిస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగపురం ఇందిర వర్గీయు లు ఆరోపించారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడా రు.
ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో దళితుల జనాభా 85 వే లుంటుందన్నారు. ఇందులో అత్యధికులు మాదిగలు కావడంతో ఎమ్మెల్యే శ్రీహరి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆరోపించారు. కడియం పార్టీలోకి వచ్చాక తమపై ఆధిపత్యం చెలాయిస్తున్న విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇటీవల స్టేషన్ ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి రాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులమైన తమకు కడియం స్టేజి పాస్‌లు ఇవ్వకుండా అవమాన పరిచారని గుర్తుచేశారు.