హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ఫూర్తి ప్రదాత బీఆర్ అంబేదర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ము ద్రించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్కు ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జేరిపోతుల పరశురాం విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. పరశురాం మాట్లాడు తూ, ప్రపంచంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి, అణగారిన వర్గాల ప్రజల ఆత్మగౌరాన్ని సీఎం కేసీఆర్ నిలబెట్టారని కొనియాడారు.
రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టడంపై ఆనందం వ్యక్తంచేశారు. ఇదే స్ఫూర్తితో కరెన్సీ నోట్లపై అంబేదర్ ఫొటో ముద్రించాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, పార్లమెంట్లో ఎంపీలతో డిమాండ్ చేయించాలని, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖ రాయాలని సీఎం కేసీఆర్ను విజ్ఞప్తి చేశారు. ఈ నెల 13న సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభ నిర్వహించనున్నామని, దళిత, బహుజన సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పరశురాం పిలుపునిచ్చారు.