Revanth Reddy | హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మధ్య దూరం మరింత పెరిగిందా?.. అం టే ప్రస్తుత పరిణామాలను బట్టి అవుననే అనిపిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం కొత్త ఉస్మానియా దవాఖాన నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరుకు శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేశారు. అయితే.. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ లేకుండానే ఈ సమీక్ష నిర్వహించారు. పైగా.. మంత్రి దామోదర శనివారం హైదరాబాద్‌లోని మంత్రుల క్వార్టర్లలోనే అందుబాటులో ఉన్నారు. అయినా సమీక్షకు మంత్రిని ఆహ్వానించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిం ది.
ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రి దామోదరకు కొంత గ్యాప్ ఉన్నదనే ప్రచా రం జరుగుతున్నది. తాను ఉమ్మడి రాష్ట్రంలోనే డిప్యూటీ సీఎంగా పనిచేశానని, రేవంత్‌రెడ్డి తనకన్నా చాలా జూనియర్ అని దామోదర పదేపదే తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానిస్తుంటారని మొదటి నుంచీ గు సగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తున్నది. దీనికి త గ్గట్టే సీఎం ఇతర శాఖల్లో లోటుపాట్లపై నేరుగా సమీక్షించి, నిర్ణయా లు చెప్పేవారు. కానీ వైద్యారోగ్య శాఖపై మాత్రం మంత్రి దామోదర అనుమతి తీసుకున్న తర్వాతే సమీక్షించేవారని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. కానీ శనివారం మంత్రి లేకుండానే దవాఖానపై సమీక్షించడం దేనికి సంకేతం అనే చర్చ మొదలైంది.
జూపల్లిని పిలిచి.. దామోదరను మరిచి
వాస్తవానికి ఉస్మానియా దవాఖానను హోంశాఖకు చెందిన భూమిలో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షలో పాల్గొన్నారు. కానీ వైద్యారోగ్య శాఖ నుం చి ఏ ఒక్క అధికారి కూడా పాల్గొనలేదు. వైద్యశాఖ మంత్రి, అధికారులు లేకపోయినా దవాఖాన డిజైన్లను సీఎం పరిశీలించారు. డిజైన్లలో మార్పులు, చేర్పులను సూచించారని సీఎంవో తెలిపింది. ఉస్మానియాపై సీఎం సమీక్షిస్తున్నారనే స మాచారం కూడా మంత్రికి లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీఎంవో నుం చి ప్రెస్‌నోట్ వచ్చిన తర్వాతే వారికి విష యం తెలిసిందని అంటున్నారు. సీఎం రేవంత్ ఎక్సైజ్, విద్యుత్తు శాఖలపైనా ని ర్వహించిన సమీక్షలో ఆ శాఖ మంత్రులు జూపల్లి, భట్టి పాల్గొన్నారు. కానీ వైద్యశా ఖ సమీక్షలో మంత్రి దామోదరను దూరం పెట్టడంపై చర్చ మొదలైంది.