హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి 8 రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌కు చేరుకున్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన బృందం.. బుధవారం మధ్యాహ్నం నారిటా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నది. పర్యటనలో భాగంగా 22వరకు జపాన్‌లోని టోక్యో, మౌంట్ఫుజి, ఒసాకా, హిరోషిమాలో సీఎం బృందం పర్యటించనున్నది. ఒసాకాలో ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో సీఎం పాల్గొననున్నారు. జపాన్‌లో కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత అభివృద్ధిపై బృందం అధ్యయనం చేయనున్నది. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ కోసం జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతోపాటు, అక్కడి వ్యాపారవేత్తలు, వివిధ సంస్థలను ఆహ్వానించనున్నట్టు సమాచారం. జపాన్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందానికి బుధవారం అక్కడి భారత రాయబారి శిబు జార్జ్ స్వాగతం పలికారు. టోక్యోలోని ఇండియా హౌస్‌లో రాత్రి బస ఏర్పాటు చేశారు. విందులో సీఎం రేవంత్‌తోపాటు ఎంపీలు కనిమొళి కరుణానిధి, రఘువీర్ రెడ్డి, నెపోలియన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.