హైదరాబాద్, జూన్ 15 (నమ స్తే తెలంగాణ): వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు అన్నివిధాలుగా సిద్ధం గా ఉండాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాం తికుమారి, డీజీపీ రవి గుప్తాతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సందర్శించారు. వర్షాకాలం ప్రారంభం నేపథ్యం లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్డు యూనిట్‌గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ను ఇంటిగ్రేట్ చేయాలని, ఔటర్ లోపలున్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించాలని ఆదేశించారు.