హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): విద్యాశాఖ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై ఆ శాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది. ఓ డిజిటల్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మురళి సీఎంపై తీవ్ర విమర్శలు గుప్పించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ పట్ల సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి సరైనదిగా లేదంటూ విమర్శలు చేసినట్టు స మాచారం. సీఎంకు వ్యతిరేకంగా మురళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సర్కారు ఇంకా మిగిలింది రెండేండ్లే కాబట్టి… విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్‌రెడ్డే కాబట్టి.. ఆయన ఈ శాఖకు ఇంకా ఎకువ సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని, కానీ ఈ మధ్య నిర్లక్ష్యం కొం చెం ఎకువైందని మురళి అన్నట్టు సమాచారం. మధ్యాహ్న భోజనం నా ణ్యత లేకపోవడంతో పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, తాము నివేదిక ఇస్తే పట్టించుకోలేదని అన్నట్టు తెలిసింది. విద్యారంగ అభివృద్ధికి తాము కొన్ని సూచనలతో మూడు నెలల క్రితం విద్యాశాఖకు రిపోర్టు ఇస్తే అస్సలు పట్టించుకోవడం లేదని అన్నట్టు సమాచారం.