పూడూరు, ఏప్రిల్ 8: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఓ వాహనం టైర్ పేలిపోయింది. సోమవారం హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లాలోని కొ డంగల్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తతతో త్రుటిలో పె ను ప్రమాదం తప్పింది. పూడూరు మం డలం హైదారాబాద్-బీజాపూర్ హైవే రో డ్డు మన్నెగూడ సమీపంలో సీఎం వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ పేలడంతో భద్రతా సిబ్బంది కంగారుపడ్డారు. స్థానిక పోలీసులు ఆ వాహనం టైర్ మార్పించి పంపించారు. ఈ ఘటనలో ఎ వరికీ ఎలాంటి ప్రమాదం జరుగలేదు.