CM Revanth Reddy | హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీర్ కంటే మేస్త్రీయే ఎక్కువ సంపాదిస్తున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ‘రాష్ట్రంలో రూ.15 వేలకు ఇంజినీర్ దొరుకుతున్నడు.. కానీ, 60 వేలకు కూడా మేస్త్రీ దొరకని పరిస్థితులున్నయ్’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని మార్చేందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునికీకరిస్తున్నామని చెప్పారు. డీఎస్సీ-2024లో ఉద్యోగాలు పొందినవారికి బుధవారం ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి నియామకపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ప్ర భుత్వ బడికి వెళ్లడమంటేనే గ్రామాల్లోనూ నా మోషీగా భావిస్తున్నారని, ఉపాధిహామీ కూలీ లు సైతం తాము తిన్నా, తినకపోయినా పుస్తెలమ్మి తమ పిల్లలను ప్రైవేట్ బడికి పంపాలనుకుంటున్నారని, ఈ పరిస్థితిని మార్చాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిడ్డలను ఇంజినీర్లుగా, సైంటిస్టులు, డాక్టర్లుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుకోవడా న్ని గర్వంగా చెప్పుకునే రోజులు రావాలని ఆ కాంక్షించారు. తెలంగాణ బిడ్డలు ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలన్న లక్ష్యంతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 30 వేల సర్కారు స్కూళ్లలో 24 లక్షల మంది విద్యార్థులు ఉంటే, పదివేల ప్రైవేట్ పాఠశాలల్లో 34 లక్షల మంది విద్యార్థులు చదువుకొంటున్నారని వివరించారు. ప్రైవేట్‌లో సర్కారు టీచర్ల కంటే ఎక్కువ చదువుకున్నవారు, గొప్ప వ్యక్తులు, అనుభవమున్నవారు బోధిస్తున్నారా? అని ప్రశ్నించారు.
అభిషేక్ మను సింఘ్వీ హాజరు
రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ మనుసింఘ్వీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన చేతు ల మీదుగా పలువురు నూతన టీచర్లకు నియామకపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మం త్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, కొం డా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, సీఎస్ శాంతికుమారి, విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.