హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు సింగపూర్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) సంస్థ సంసిద్ధతను వ్యక్తంచేసింది. ఈ మేరకు ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం శుక్రవారం సింగపూర్ చేరుకుంది. అక్కడి ఐటీఈ క్యాంపస్‌ను సందర్శించింది. అక్కడ నైపుణ్యాభివృద్ధి కోసం నిర్వహిస్తున్న కోర్సులను, సదుపాయాలను పరిశీలించింది. అకడ శిక్షణ ఇస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందితో, ఐటీఈ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా తమ యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీకి సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. యువతకు ఉపాధి కల్పించేందుకు మారెట్ డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కోర్సులు నిర్వహిస్తు న్న తీరును ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.
నైపుణ్యాల అభివృద్ధి (సిల్ డెవలప్మెంట్) శిక్షణలో పరస్పర సహకారంతో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రతిపాదించారు. దీనికి ఐటీఈ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. ఈ సందర్భంగా కుదుర్చుకున్న ఎంవోయూపై వర్సిటీ వీసీ సుబ్బారావు, సింగపూర్ ఐటీఈ తరఫున అకడమిక్ అండ్ అడ్మిన్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్సింగ్ సంతకాలు చేశారు. త్వరలోనే ఐటీఈ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ను సందర్శించనున్నది. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేకకార్యదర్శి అజిత్‌రెడ్డి, యంగ్ ఇండియా సిల్ వర్సిటీ వీసీ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు ఉన్నారు.
సింగపూర్ విదేశాంగ మంత్రితో భేటీ
తొలిరోజు పర్యటనలో భాగంగా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, నదుల పునరుజ్జీవనం, నీటి వనరుల నిర్వహణ, హరిత ఇంధనం, పర్యాటకం, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఐటీ పారుల అభివృద్ధి అంశాలపై చర్చలు జరిపారు.