హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దయినట్టు సమాచారం. ఆయన ఈ నెల 14న ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉన్నది. అక్కడి నుంచి 19న సింగపూర్‌కు, ఆ తర్వాత దావోస్‌లో పర్యటించాల్సి ఉన్నది.
షెడ్యూల్లో మార్పులు జరిగినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సీఎం 14న ఢిల్లీకి వెళ్లనున్నారు. 15న ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. 16న ఢిల్లీలోనే ఉండి, 17న అక్కడి నుంచి బయల్దేరి సింగపూర్, 19న దావోస్‌కు వెళ్లి 20 నుంచి 23 వరకు అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నట్టు తెలిసింది.