సుల్తాన్‌బజార్, మార్చి 9: ఆసిఫాబాద్‌లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ పేరు పెడతామని సీఎం రేవంత్ తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అఖిలభారత పద్మశాలి సంఘం మహాసభలలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ పద్మశాలీలు ఆత్మగౌరవానికి, త్యాగానికి మారుపేరు అని కొనియాడారు. అందుకు కొండా లక్ష్మణ్ బాపూ జీ నిదర్శనమని చెప్పారు. కులగణన సర్వేలో తప్పులుంటే చెప్పాలని ప్రతిపక్షాలకు సూచించారు. తమ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేస్తుందని తెలిపారు.
రైతులు, నేత కార్మికులు తమకు రెండు కండ్ల లాంటి వాళ్లను చెప్పారు. మహిళలకు రెండు చీరల చొప్పున పంపిణీ చేస్తామని, సంబంధించిన ఆర్డర్లను నేతన్నలకు ఇస్తామని తెలిపారు. రూ.600 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు వెల్లడించారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో నిర్మిస్తున్న మార్కండేయస్వామి ఆలయానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ. కోటి విరాళం అందజేస్తామని హా మీ ఇచ్చారు.
సీఎం రేవంత్‌కు సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, కార్యదర్శి గడ్డం జగన్నాథం, సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కమర్థపు మురళి తదితరులు పాల్గొన్నారు.