Revanth Reddy | హైదరాబాద్ : మరికాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు బయల్దేరనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి రేవంత్ వెళ్లనున్నారు. శనివారం ఢిల్లీలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. సీఎం రేవంత్‌తో పాటు పలువురు ఎంపీలు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లు సమాచారం. తెలంగాణలోని 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే.
ఢిల్లీ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అధిష్టానంతో మంత్రి వర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, జహీరాబాద్ నుంచి సురేశ్ కుమార్ షెట్కార్, నాగర్‌కర్నూల్ నుంచి మల్లు రవి, నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్, భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ నుంచి కడియం కావ్య, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురామ్ రెడ్డి గెలుపొందారు.