హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి 21వ సారి ఢిల్లీకి వెళ్లారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఆయన రాత్రికి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇటు అధిష్ఠానంతో, అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ కానున్నారు. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నట్టుగా తెలిసింది. రాష్ట్రంలో కురిసిన వర్షాలు, నష్టంపై చర్చించి నష్టపరిహారం కోరనున్నట్టుగా తెలిసింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతోనూ భేటీ అయి మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీంతో పాటు హైడ్రా పరిణామాలను కూడా అధిష్ఠానానికి వివరించనున్నట్టుగా తెలిసింది