భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం(Bhadrachalam) సీతారామ చంద్రుల స్వామివారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గుట్టకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి గర్భగుడిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర మంత్రులు పూజలు చేశారు. స్వామి వారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పండుతులు వేద ఆశీర్వచనం స్వామి వారి ప్రసాదం అందజేశారు. దేవస్థానం ఈవో రమాదేవి స్వామి వారి చిత్రపటాలను అందజేశారు.