హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొక్క నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.
కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి కొండా సురేఖతోపాటు ఆ శాఖ అధికారు లు, సిబ్బంది పాల్గొననున్నట్టు చెప్పారు. తొలుత ఆదివారం నుంచి వనమహోత్సవాన్ని నిర్వహించాలని ప్రకటించినప్పటికీ, సాంకేతిక కారణాలతో సోమవారానికి వాయిదా వేసినట్టు అధికారులు ప్రకటించారు.