హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతోనూ భేటీ అయ్యే అవకాశమున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం, స్థానిక ఎన్నికలు, మంత్రివర్గంలో మార్పులపై చర్చించే అవకాశమున్నట్టు సమాచారం. సీఎంగా రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 58వ సారి కావడం గమనార్హం.