భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీతారామ ప్రాజెక్టులోని(Sitarama Lift Irrigation Project) పూసుగూడెం పంప్ హౌస్‌ను ప్రారంభించారు. అంతకుముందు హైదరాబాద్‌లో పంద్రాగస్టు వేడుకల్లో ప్రసంగించిన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో తొలుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేరుకున్నారు. అక్కడ సీతారామ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన రెండోదైన పూసుగూడెం పంప్ హౌస్‌ను లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మలనాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
భద్రాద్రి గూడెం – సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. జిల్లాలోని పూసుగూడెంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి,… pic.twitter.com/eyGGcfvgG7
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2024