హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): వినాయకచవితి సందర్భంగా రాష్ట్రప్రజలకు సీఎం రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
గ్రేటర్లో ‘చవితి’ సందడి
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ): వైవిధ్య ప్రతిమలు, మంత్రోచ్ఛారణలు, శ్రావ్యమైన గీతాలు, వాయిద్యాల మేళవింపులు, అలంకర ణలు.. ఇంతటి సందడి తెచ్చే వినాయక చవితి పర్వదినం వచ్చేసింది. బస్తీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో మండపా లు సిద్ధమయ్యాయి. గ్రేటర్ అంతా సందడి వాతావరణం నెలకొన్నది. మరో వైపు నగరవాసులు పర్యావరణ హిత మట్టి విగ్రహాలను ప్రతిష్టించేందుకు మ క్కువ చూపుతున్నారు.