Jagadish Reddy | రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటిదొంగలా దొరికిపోయిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. రైతుల ఆగ్రహానికి దిగొచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు ఇంకా 17.13 లక్షల మందికి రుణమాఫీ కాలేదని వెల్లడించినట్టు చెప్పారు. రుణమాఫీ మొత్తం అయిపోయిం దని డ్యాన్స్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడేం చెప్తారని నిలదీశారు. ‘సీఎం చెప్పింది అబద్ధమని ఉత్తమ్ మాటలతో తేలిపోయింది.. ముక్కు నేలకు రాసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? చెంపలు వేసుకుంటావా? అని నిల దీశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రుణమాఫీలో కాంగ్రెస్ సరార్ విఫలమైందని విమర్శించా రు. బ్యాంకర్ల లెక ప్రకారం.. 50 లక్షల మందికిపైగా రైతుల రూ.2 లక్షల రుణాలు రూ.49 వేల కోట్ల వరకు ఉన్నాయని తెలిపారు. ‘ఆగస్టు 15లోగా వివరాలు సరిగ్గా ఉన్న 22.37 లక్ష మంది రైతుల రుణాలు మాఫీ చేశాం. ఆధార్నంబర్లలో తేడాలు ఉన్న 1.20 లక్షలు, బ్యాం కు, ఆధార్‌కార్డుల్లో పేర్లలో తేడాలున్న 1.6 లక్షలు, బ్యాంకులు ఇచ్చిన వివరాల్లో తప్పులు ఉన్న 1.5 లక్షలు, రేషన్కార్డులేనివారు 4.83 లక్షల మంది రైతులతోపాటు రూ.2 లక్షలకు మించి రుణం పొందిన మరో 8 లక్షల మంది.. ఇలా మొత్తం 17.13 లక్షలు మంది రైతులను రుణమాఫీ జరుగలేదు’ అని మంత్రి ఉత్తమ్ చెప్పినట్టు గుర్తుచేశారు.
మరి ణ): రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగటిదొంగలా దొరికిపోయిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతుల ఆగ్రహానికి దిగొచ్చిన రేవంత్‌రెడ్డి సర్కారు ఇంకా 17.13 లక్షల మందికి రుణమాఫీ కాలేదని వెల్లడించినట్టు చెప్పారు. రుణమాఫీ మొత్తం అయిపోయిందని డ్యాన్స్ ఇప్పుడు ముకు నేలకు రాయాల్సింది ఎవరని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటేరియట్ వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహం తొలగించి, ప్రజల అభిప్రాయం మేరకు అకడ విగ్రహం పెడతామని చెప్పారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న తమ డిమాండ్‌పై సీఎం రేవంత్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.