CM Revanth Reddy | ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
CM Revanth Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్ గ్రేషియాను రూ. 4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే బాధిత కుటుంబాలకు ఆ సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. చనిపోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచాలని, మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే రూ. 3 వేల సాయం రూ.5 వేలకు పెంచాలని సీఎం ఆదేశించారు. తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని సూచించారు.
వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి రూ. 10 వేల చొప్పున పంట నష్ట పరిహారం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయలని ఆదేశించారు. కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి రూ.5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోనే కాకుండా, జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్స్ 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు.
ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నిత్యావసర వస్తువుల పంపిణీ, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలతో వాటిల్లిన నష్టంపై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి, కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కోరేందుకు నివేదికను సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ అధికార బృందాలతో పాటు స్వయంగా ప్రధాన మంత్రి ఈ విపత్తును పరిశీలించేందుకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
Vande Bharat Express | తిరుపతి – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రీషెడ్యూల్..
KTR | తెలంగాణకు కష్టమొచ్చిందంటే ముందుండేది బీఆర్ఎస్సే.. కేటీఆర్ ట్వీట్
Khammam Floods | ఖమ్మం జన జీవనంపై జలఖడ్గం.. ఫోటోలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

