హైదరాబాద్, ఆగస్టు18(నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన హస్తినకు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 32నెలల కాలంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ఇది 76వ సారి. బుధవారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ వరింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశానికి ఆయన హాజరవుతారు. రాష్ట్రం నుంచి సీఎంతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు. సమావేశం అనంతరం అదే రోజు రాత్రి ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరి వెళ్తారు. మిగిలిన తెలంగాణ నేతలు హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. 20వ తేదీ సాయంత్రం 6గంటలకు లండన్‌లో జరిగే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒకుమార్తె వివాహానికి కుటుంబ సభ్యులతో కలిసి సీఎం హాజరవుతారు. ఇంగ్లండ్, అమెరికా దేశాల్లో పారిశ్రామికవేత్తలు, కంపెనీలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నట్టు సమాచారం.