Wasim Akram | అతడు నా స్నేహితుడు.. అతడి ఆరోగ్యంపై రాజీ పడను..!
Wasim Akram పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఒకప్పటి క్రికెటర్ల మద్దుతు పెరుగుతోంది. జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వరసగా డిమాండ్ చేస్తున్నారు.
Wasim Akram పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ఒకప్పటి క్రికెటర్ల మద్దుతు పెరుగుతోంది. జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని వరసగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భారత దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ సహా 22 మంది ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ మాజీ కెప్టెన్లు పాక్ ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ఆ దేశానికే చెందిన వెటరన్ వసీం అక్రమ్(Wasim Akram) కూడా ఇమ్రాన్ ఆరోగ్యంపై తాము రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పారు.
తమతో ఒకప్పుడు ఆడిన దిగ్గజ ఆటగాడి కోసం క్రికెట్ లోకం కదులుతోంది. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ఆ దేశ మాజీ ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. అతడికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు మాజీలు. పాక్ లెజెండ్ వసీం అక్రమ్ కూడా ఇమ్రాన్‌కు బాసటగా నిలిచాడు.
“There can be no compromise on his health” – Wasim Akram has joined the chorus of cricketing legends raising concerns about Imran Khan’s health 🗣️ pic.twitter.com/Pb4hEILIO8
— Cricinfo (@cricinfo) September 8, 2026
‘ఇమ్రాన్ నాకు స్నేహితుడు. అతడిని నేను చాలా మిస్ అవుతున్నా. మూగేళ్లుగా అతడితో నేను మాట్లాడలేదు. రాజకీయంగా అతడికి జరిగినదంతా చాలా దురదృష్టకరం. కోర్టు చట్టం అనేది కోర్టు చట్టమే. కానీ, ఆరోగ్యం విషయంలో రాజీ పడడం కుదరదు’ అని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. ఇదివరకే 22 మంది మాజీ కెప్టెన్లు ఇమ్రాన్‌కు మెరుగైన వైద్యం గురించి పాక్ ప్రధాని షహ్బాజ్ షరీఫ్‌కు బహిరంగ లేఖ రాశారు.
Read more: https://t.co/FsStrBeMEO
— Cricinfo (@cricinfo) September 8, 2026
పాక్ మాజీ ఆటగాడు జావేద్ మియాందాద్ కూడా ఇమ్రాన్‌ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, వెస్టిండీస్ వెటరన్ బ్రియాన్ లారా సైతం ఇమ్రాన్‌కు మంచి వైద్యం అందించడం మానవత్వం అని పాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అవినీతి, దేశ రహస్యాల వెల్లడి, ఇతర చట్టపరమైన నేరాల కింద ఇమ్రాన్ జైలుకు వెళ్లాడు. 2023 ఆగస్టు నుంచి ఆయన జైల్లోనే మగ్గుతున్నాడు. ఇటీవల ఇమ్రాన్ కంటి చూపు కోల్పోయాడు. దాంతో.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని క్రికెట్ లోకం డిమాండ్ చేస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

