Allu Arjun | లోక చాప్టర్ 1: చంద్ర సినిమాతో డైరెక్టర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు మాలీవుడ్ దర్శకుడు డొమినిక్ అర్జున్. సినీ ఇండస్ట్రీలో ప్రతీ వ్యక్తికి ఎంతో అభిమానించే యాక్టర్లుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ దర్శకుడు కూడా స్టార్ యాక్టర్ అల్లు అర్జున్‌కు వీరాభిమాని. మాలీవుడ్‌లో అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. ఈ స్టార్ హీరో అభిమానుల జాబితాలో పాపులర్ సెలబ్రిటీలూ ఉంటారు. అందరు సెలబ్రిటీల్లాగే డొమినిక్ అర్జున్ ఈ జాబితాలో చేరిపోయాడు.
బన్నీని కలిసే అవకాశం వచ్చింది. ఇంకేంటి వెంటనే అతడితో సెల్ఫీ దిగాడు డొమినిక్ అర్జున్. ఈ సందర్భంగా లోక చాప్టర్ 1పై ప్రశంసలు కురిపించాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్‌తో లోక డైరెక్టర్ ఫ్యాన్ బాయ్ మూమెంట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. ఈ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. అప్‌కమింగ్ చాప్టర్లను మరింత ఎఫెక్టివ్‌గా తెరకెక్కించేలా డొమినిక్ అర్జున్‌కు అల్లు అర్జున్ ప్రశంసలతో ప్రోత్సాహం అందిందనడంలో ఎలాంటి సందేహం లేదు.