Apple event : యాపిల్ బ్రాండ్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 9, బుధవారం జరగనుంది. అమెరికా (క్యాలిఫోర్నియా)లోని యాపిల్ పార్క్‌లో ఈవెంట్ జరగనుంది. యాపిల్ మోస్ట్ అవైటెడ్ ఫోల్డబుల్ ఫోన్ ఈ ఈవెంట్లోనే రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంసంగ్, మోటా వంటి అనేక సంస్థలు ఫోల్డబుల్ ఫోన్లు రిలీజ్ చేశాయి.
కానీ, టాప్ బ్రాండ్ యాపిల్ మాత్రం తన ఫోల్డబుల్ తీసుకురావడానికి ఇంతకాలం పట్టింది. దీంతో బుధవారం రిలీజ్ కానున్న యాపిల్ ఫోన్ ఎలా ఉంటుందా అనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఫోల్డబుల్ ఫోన్‌తోపాటు ఐఫోన్ 18ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఫోన్లు కూడా బుధవారమే విడుదల కానున్నాయి. వీటితోపాటు యాపిల్ వాచ్ కూడా రిలీజవనుంది. యాపిల్ వాచ్ 12 పేరుతో ఈ స్మార్ట్‌వాచ్ రిలీజ్ కానుంది. అలాగే, ఎయిర్‌పాడ్స్ వెర్షన్ 5 కూడా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. అయితే, వీటి విడుదలపై అధికారిక ప్రకటన మాత్రం లేదు. ఈవెంట్ తర్వాతే రిలీజవుతున్న డివైజెస్‌పై క్లారిటీ వస్తుంది. అందుకే, యాపిల్ లవర్స్ దీనికోసం ఎదురు చూస్తున్నారు.
ఈ ఈవెంట్లో యాపిల్ నూతన సీఈవో జాన్ టెర్నస్ హాజరుకానున్నారు. ఆయన ఈవెంట్లో పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రస్తుతం చిప్స్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ఫోన్లు, ఇతర డివైజెస్ రేట్లు అధికంగానే ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఈవెంట్‌కు యాపిల్ మాజీ సీఈవో టిమ్ కుక్ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. ఆయన ఈ నెల 1న సీఈవో నుంచి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరిలో ఎవరు కొత్త ఫోన్స్ లాంఛ్ చేస్తారో అనే ఉత్కంఠ నెలకొంది.