హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులకు తకువ వడ్డీ రేటు తో రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి హడోను కోరారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠతో సమావేశమయ్యారు. ఫ్యూచ ర్ సిటీ, మెట్రో విస్తరణ, ట్రిపుల్ఆర్, రేడియల్ రోడ్ల నిర్మాణం గురించి వివరించారు. ఈ ప్రాజెక్టులకు తకువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశా రు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూర్, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారులు, బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రహదారి, బుల్లెట్ రైలు మార్గంపై ఈ భేటీలో చర్చ జరిగింది. 10 లక్షల ఇండ్ల నిర్మాణానికి త్వరగా రుణాలు మంజూరు చేయాలన్న సీఎం రేవంత్ విన్నపానికి ఆయన సానుకూలంగా స్పందించారు. గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాలని హడో చైర్మన్‌ను సీఎం ఆహ్వానించారు.
కొండగట్టు బాధితులను ఆదుకోండి..
కొండగట్టులో అగ్నిప్రమాదం వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం వారు సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు.