శాంతి మార్గం అనుసరణీయం
సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌లో జరిగిన బుద్ధ పూర్ణిమ వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు.
- అశాంతి, అసూయను అధిగమించాలి
- బుద్ధుని సందేశం దేశానికి అవసరం
- శాంతిని పరిరక్షించే బాధ్యత అందరిది
- బుద్ధపూర్ణిమ వేడుకల్లో సీఎం రేవంత్
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార్‌లో జరిగిన బుద్ధ పూర్ణిమ వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంయుక్త నిఖాయ నాలుగో నిఘంటువును ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మహాబోధి బుద్ధ విహార్‌కు రావడం గొప్ప క్షేత్రాన్ని సందర్శించిన అనుభూతి కలిగిందని సంతోషం వ్యక్తంచేశారు.
గౌతమ బుద్ధుడి బోధనలు అందిరికీ అవసరమని పేర్కొన్నారు. రాజ్యం, అధికారం ఉండీ వాటిని కాదని 29 ఏండ్ల వయసులోనే శాంతి కోసం బుద్ధుడు ఆలోచించాడని గుర్తుచేశారు. ప్రస్తుతం సమాజంలో స్పర్థలు, ఉద్వేగాలు పెరిగేలా వాతావరణం నెలకొని ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. బుద్ధుని సందేశం దేశానికి ఇప్పుడు ఎంతో అవసరమని తెలిపారు. రెండున్నర వేల సంవత్సరాలుగా బౌద్ధ సిద్ధాంతం నిలబడి ఉన్నదని చెప్పారు. ప్రతి పనిని ధ్యానంగా చేయాలన్న సూచనలో చాలా అర్థం ఉన్నదని, ఈ సూక్తి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందినట్టు చెప్పారు. ఏ పని అయినా తాను ఎంతో ధ్యానంగా చేస్తానని తెలిపారు. ధ్యాన మందిరం కోసం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ధ్యాన మందిరం ఆధ్వర్యంలో పాఠశాలను నిర్వహించాలని కోరారు. తెలంగాణలో బుద్ధ బిక్షులకు తగిన గౌరవం ఉంటుందని పేర్కొన్నారు. మహాబోధి బుద్ధవిహార్‌కు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని రేవంత్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

